Teks Academy 2024

 

టెక్స్ అకాడమీ ద్వారా డిగ్రీ విద్యార్థినులకు ఉచితంగా కంప్యూటర్ కోర్సులు ఈ రోజు శివాని ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో టెక్స్ అకాడమీ డిగ్రీ విద్యార్థినులకు ఉచితంగా కంప్యూటర్ కోర్సులను అందించడానికి అర్హులు గల విద్యార్థినుల కోసం ఆన్‌లైన్ ధ్వారా పోటీ పరీక్షను నిర్వహించింది. బి.ఎస్.సి , బి.కాం, చదువుతున్న విద్యార్థిను లు రంగం నవనీత, పడిదెల సాత్విక, కె శిరీష లు ఎంపిక ఆయనందుకు చైర్మన్ డాక్టర్ పి. రాంరెడ్డి గారు శుభాకాంక్షలు తెలిపారు మరియు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలాంటి ఉచిత కోర్సులు మరియు ప్లేస్‌మెంట్ అందించే డ్రైవ్‌లు సంకేతిక వికాసనికై ఖచ్చితంగా సహాయపడతాయని,విద్యార్థినులు లక్ష్యసాధన కోసం కృషి చేయాలని అన్నారు. కరస్పాండెంట్ వెదిరే సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు జీవితంలో నిరంతర కృషి తపనతో ఎన్నో విజయాలు సాధించవచ్చన్నారు ప్రిన్సిపాల్ భీంరెడ్డి అనిత గారు విద్యార్థినులు కోర్సులు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న టెక్స్, యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు కోర్సులు పూర్తయిన తర్వాత విద్యార్థులకు ఉద్యోగాలు కల్పిస్తామని, టెక్స్‌ అకాడమీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీల్లో ఉద్యోగులుగా ప్రవేశాలు కల్పిస్తామని మోహన్‌ దాస్‌ కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌ మేనేజర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.